కడప లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ షర్మిల

  • అంతకుముందు ఇడుపులపాయ వైఎస్ ఘాట్ వద్ద నివాళులు
  • సునీతతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు
  • కడప ప్రజలు మంచి తీర్పు ఇస్తారని భావిస్తున్నానన్న షర్మిల
కడప నుంచి లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కొద్దిసేపటి క్రితం నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ వివేకా కుమార్తె సునీతతో కలిసి కడప కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందించారు. అంతకుముందు ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద నామినేషన్ పత్రాలను ఉంచి షర్మిల నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కడప నియోజకవర్గ ప్రజలు ఈ ఎన్నికల్లో మంచి తీర్పు ఇస్తారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

అంతకుముందు షర్మిల ఎక్స్‌లో పోస్టును షేర్ చేస్తూ.. ‘‘ఒక అపురూప ఘట్టం ఆవిష్కరించబోతున్న ఈ సందర్భంలో, దేవుని దీవెనలు, నాన్న ఆశీర్వాదం, నా ప్రియమైన అమ్మ, ముద్దుల బిడ్డల శుభాకాంక్షలు అందుకుని, న్యాయం కొరకు, విజయం వైపు ఈ అడుగు వేస్తున్నాను.  వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారిని,  వైఎస్ వివేకానంద‌రెడ్డి గారిని మరిచిపోలేని ప్రజలు, అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ధర్మం వైపే మన కడప ప్రజలు నిలబడతారని ఆశిస్తుంది మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ’’ అని పేర్కొన్నారు.


More Telugu News