భారత్ లో ఓపెన్ ఏఐ తొలి ఉద్యోగిగా ప్రగ్యా మిశ్రా నియామకం
- కంపెనీ పబ్లిక్ పాలసీ వ్యవహారాలకు సారథ్యం
- గతంలో ఇండియాలో వాట్సాప్ మొదటి ఉద్యోగి కూడా ఆమెనే
- ఎన్నో సంస్థల్లో పనిచేసిన అనుభవం ఆమె సొంతం
అమెరికాకు చెందిన కృత్రిమ మేథ (ఏఐ) సంస్థ ఓపెన్ ఏఐ.. భారత్ లో తమ తొలి ఉద్యోగిగా ప్రగ్యా మిశ్రా అనే మహిళను తాజాగా నియమించింది. దేశంలో పబ్లిక్ పాలసీ వ్యవహారాలు, భాగస్వామ్యాలకు సారథ్యం వహించేందుకు ప్రగ్యా మిశ్రాను ఓపెన్ ఏఐ నియమించినట్లు సంబంధిత వర్గాలు ఐఏఎన్ ఎస్ వార్తా సంస్థకు తెలిపాయి. ప్రగ్య గతంలో ట్రూ కాలర్ సంస్థలో పబ్లిక్ అఫైర్స్ డైరెక్టర్ గా పనిచేశారు. వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, పెట్టుబడిదారులు, కీలక వాటాదారులు, మీడియా భాగస్వాములతో కలసి పనిచేశారు. అంతకుముందు ఆమె మూడేళ్లపాటు మెటా ప్లాట్ఫాంలలో పనిచేశారు. గతంలో వాట్సాప్ సంస్థ భారత్ లో నియమించిన తొలి ఉద్యోగి కూడా ప్రగ్యా మిశ్రానే కావడం గమనార్హం. తప్పుడు సమాచార వ్యాప్తికి వ్యతిరేకంగా వాట్సాప్ 2018లో చేపట్టిన ప్రచార ఉద్యమానికి ఆమె నేతృత్వం వహించారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి..
ప్రగ్యా మిశ్రా బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె ఇంటర్నేషనల్ మేనేజ్ మెంట్ ఇన్ స్టిట్యూట్ నుంచి 2012లో ఎంబీఏ పట్టా అందుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి కామర్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రఖ్యాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుంచి బేరసారాలు, సంప్రదింపులపై డిప్లొమా కోర్సు చేశారు. అలాగే ఎర్నస్ట్ అండ్ యంగ్, ఢిల్లీలోని రాయల్ డానిష్ ఎంబసీలోనూ పనిచేశారు. ఆమె ఒక పాడ్ కాస్టర్, ఇన్ స్టా గ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్ కూడా. ఆమెకు 35,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రగ్యాన్ పాడ్ కాస్ట్ పేరుతో ధ్యానం, మానవ చైతన్యం లాంటి అంశాలపై పాడ్ కాస్ట్ లు నిర్వహిస్తుంటారు. ఆమె హృదయపూర్వక ధ్యానం శిక్షకురాలు కూడా.