నామినేషన్ వేసిన నన్ను పోలీసులు నిత్యం వేధిస్తున్నారు: బొండా ఉమా
- వందమంది పోలీసులు తమ ఆఫీస్‌ను చుట్టుముట్టారన్న టీడీపీ నేత
- సీఎంపై గులకరాయి దాడి జరిగితే మైనర్‌ను తప్పుడు కేసులో ఇరికించారని మండిపాటు
- రిమాండ్‌లో ఉన్న వేముల సతీశ్ తల్లిదండ్రులను అక్రమంగా నిర్బంధించారని ధ్వజం
- నేరగాడి చేతిలో కీలుబొమ్మలా పోలీసులు మారిపోవడం దుర్మార్గమన్న బొండా ఉమా
నామినేషన్ వేసిన తనను పోలీసులు నిత్యం వేధిస్తున్నారని టీడీపీ నేత బొండా ఉమా అన్నారు. వందమంది పోలీసులు నిన్న తమ ఆఫీస్‌ను చుట్టుముట్టారని తెలిపారు. ఇద్దరు ఏసీపీలు, నలుగురు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు, కానిస్టేబుళ్లు కార్యాలయాన్ని చుట్టుముట్టారని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి జగన్‌పై గులకరాయి దాడి జరిగితే మైనర్‌ను తప్పుడు కేసులో ఇరికించి లోపల పెట్టారని దుయ్యబట్టారు. రిమాండ్‌లో ఉన్న వేముల సతీశ్ తల్లిదండ్రులను అక్రమంగా నిర్బంధించారని బొండా ఉమా ఆరోపించారు. మేం చెప్పినట్టు 164 స్టేట్‌మెంట్ ఇవ్వకపోతే శాశ్వతంగా మీ కుమారుడిని జైలులో ఉంచుతామని పోలీసులు బెదిరిస్తున్నట్లు పేర్కొన్నారు. నేరగాడి చేతిలో కీలుబొమ్మలా పోలీసులు మారిపోవడం దుర్మార్గమని టీడీపీ నేత ఆవేదన వ్యక్తం చేశారు.