భారత మార్కెట్‌లో ఏఐ ఆధారిత కమర్షియల్ పోర్టుఫోలియో ల్యాప్‌టాప్‌లు విడుదల చేసిన డెల్

  • ప్రెసిషన్, లాటిట్యూడ్ పోర్టుఫోలియోల్లో ల్యాప్‌టాప్‌ల ఆవిష్కరణ
  • లాటిట్యూడ్ పోర్ట్‌ఫోలియోలో ప్రారంభ ధర రూ.1,10,999గా ఉందన్న డెల్
  • ప్రెసిషన్ పోర్ట్‌ఫోలియోలో ఆరంభ ధర రూ. 2,19,999గా ఉన్నట్టు వెల్లడి
గ్లోబల్ టెక్ దిగ్గజం ‘డెల్ టెక్నాలజీస్’ భారత విపణిలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత సరికొత్త కమర్షియల్ పోర్టుఫోలియో ల్యాప్‌టాప్‌లు, మొబైల్ వర్క్‌స్టేషన్లను ఆవిష్కరించింది. డెవలపర్లు, పవర్ యూజర్ల కోసం ప్రెసిషన్ పోర్ట్‌ఫోలియో.. కార్పొరేటు, వ్యాపార వర్గాలు వినియోగానికి లాటిట్యూడ్ పోర్ట్‌ఫోలియో ఉత్పత్తులను విడుదల చేసింది. లాటిట్యూడ్ పోర్ట్‌ఫోలియోలో ప్రారంభ ధర రూ.1,10,999గా, ప్రెసిషన్ పోర్ట్‌ఫోలియోలో ఆరంభ ధర రూ. 2,19,999గా ఉన్నాయి.

లాటిట్యూడ్ పోర్ట్‌ఫోలియోలో ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్స్ వరకు ల్యాప్‌టాప్‌లు లభిస్తున్నాయి. 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7-1355యూ ప్రాసెసర్స్ కాన్ఫిగరేషన్‌లతో 5000 సిరీస్ ల్యాప్‌టాప్‌లు కూడా లభ్యమవుతాయని కంపెనీ తెలిపింది. కొత్తగా ఆవిష్కరించిన ల్యాప్‌టాప్‌లలో ప్రపంచంలోనే అత్యంత కొలాబరేటివ్ కమర్షియల్ పీసీగా పరిగణిస్తున్న లాటిట్యూడ్ 9450 2-ఇన్-1 ఉందని తెలిపింది. ప్రపంచంలో అతి చిన్న ప్రధాన స్రవంతి కమర్షియల్ ల్యాప్‌టాప్‌గా పేర్కొంటున్న లాటిట్యూడ్ 5450 కూడా ఉందని వివరించింది. 

అదనంగా ఎక్కువకాలం మన్నిక ఉండే లాటిట్యూడ్ 7350 డిటాచబుల్‌ పీసీని కూడా ఆవిష్కరించినట్టు డెల్ తెలిపింది. ఇది ప్రపంచంలోనే అత్యంత మన్నికైన కమర్షియల్ డిటాచబుల్ ల్యాప్‌ట్యాప్ అని పేర్కొంది. ఇక ప్రపంచంలోనే అతి చిన్న, అత్యంత శక్తిమంతమైన 14-అంగుళాల ‘ప్రెసిషన్ 5490’ వర్క్‌స్టేషన్‌ను కూడా డెల్ పరిచయం చేసింది.

కొత్తగా ఆవిష్కరించిన ఉత్పత్తుల ధరలు..
            మోడల్                               ప్రారంభ ధర
డెల్ లాటిట్యూడ్ 9450 2-ఇన్-1         రూ.2,60,699
డెల్ లాటిట్యూడ్ 7450 2-ఇన్-1         రూ.1,54,999
డెల్ లాటిట్యూడ్ 7350 అల్ట్రాలైట్          రూ.1,25,999
డెల్ లాటిట్యూడ్ 7350 డిటాచబుల్       రూ.1,73,999
డెల్ లాటిట్యూడ్ 5450                     రూ.1,10,999
డెల్ ప్రెసిషన్ 5490                          రూ.2,19,999


More Telugu News