చెన్నైపై గెలిచి ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించిన లక్నో సూపర్ జెయింట్స్
- ఏకనా స్టేడియంలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డు సృష్టించిన లక్నో
- చెన్నై నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలోనే ఛేదించిన అతిథ్య జట్టు
- ఢిల్లీ క్యాపిటల్స్ రికార్డును బ్రేక్ చేసిన లక్నో
శుక్రవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించిన లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్‌లో ఆల్‌టైమ్ రికార్డును సృష్టించింది. సొంత మైదానం ఏకనా క్రికెట్ స్టేడియంలో అత్యధిక టార్గెట్‌ను ఛేదించిన జట్టుగా లక్నో నిలిచింది. శుక్రవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని లక్నో విజయవంతంగా ఛేదించింది. ఏకనా స్టేడియంలో లక్ష్య ఛేదన చాలా సంక్లిష్టంగా ఉంటుంది. తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే ఇక్కడ విజయాలు సాధిస్తుంటాయి. లక్ష్య ఛేదనలో ఆపసోపాలు పడుతుంటాయి. గతంలో ఇక్కడ అత్యధిక ఛేదన 168 పరుగులుగా ఉంది. ఈ ఏడాది సీజన్‌లోనే లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ ఈ రికార్డు స్థాయి ఛేదన చేసింది.
ఎకనా క్రికెట్ స్టేడియంలో అత్యధిక ఛేజింగ్‌లు ఇవే...
1. సీఎస్కేపై లక్నో - 177
2. లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ - 168
3. లక్నోపై పంజాబ్ కింగ్స్ - 160
4. సన్‌రైజర్స్‌పై లక్నో - 122
కాగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలకు లక్నో సూపర్ జెయింట్స్ చెక్ పెట్టింది. 177 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 58 బంతుల్లో 83 పరుగులు బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్ క్వింటన్ డికాక్ అర్ధ సెంచరీ కూడా లక్నో గెలుపునకు దోహదపడింది. అద్భుతంగా రాణించిన కేఎల్ రాహుల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.