"మెటా ఏఐని అడగండి"... ఈ కొత్త  ఫీచర్ గమనించారా?

  • దూసుకెళుతున్న ఏఐ
  • చాట్ జీపీటీ, గూగుల్ జెమినీకి పోటీగా మెటా ఏఐ
  • నిన్న అధికారికంగా ప్రకటించిన జుకెర్ బర్గ్
భవిష్యత్ అంతా కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్)దేనని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఏఐ అనేక రంగాలలో ప్రవేశించి విప్లవాత్మక మార్పులకు కారణమవుతోంది. చాట్ జీపీటీ, గూగుల్ జెమిని (గతంలో బార్డ్) వంటి సెర్చ్ ఇంజిన్ ఏఐ టూల్స్ తో సమాచార సేకరణ కొత్త పుంతలు తొక్కుతోంది. 

ఇదే కోవలో ఫేస్ బుక్, వాట్సాప్, మెసెంజర్, ఇన్ స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా కూడా ఏఐ బాటపట్టింది. ఫేస్ బుక్, వాట్సాప్, మెసెంజర్, ఇన్ స్టాగ్రామ్ లో సెర్చ్ బాక్స్ ను క్లిక్ చేస్తే... ఆస్క్ మెటా ఏఐ ఎనీథింగ్, మెటా ఏఐని అడగండి అంటూ కొత్త ఫీచర్ దర్శనమిస్తోంది. 

మెటా ఏఐ అనేది ఉచిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్. మీరు ఎటువంటి ప్రశ్న అడిగినా మెటా ఏఐ సమాధానం చెప్పేందుకు ప్రయత్నిస్తుంది. యానిమేషన్లు, హైక్వాలిటీ ఇమేజ్ లను కూడా సృష్టిస్తుందని మెటా సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ వెల్లడించారు. రియల్ టైమ్ విషయ పరిజ్ఞానం కోసం గూగుల్, మైక్రోసాఫ్ట్ బింగ్ వంటి సెర్చ్ ఇంజిన్లను కూడా మెటా ఏఐ సమాధానాల్లో పొందుపరిచామని వివరించారు.


More Telugu News