తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితే.. ఏపీలో వైసీపీకి వస్తుంది: గంటా శ్రీనివాసరావు
- అన్ని జిల్లాల్లో వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరుతున్నారన్న గంటా
- రాజకీయాల్లో తనది ఒక ప్రత్యేక శైలి అని వ్యాఖ్య
- జగన్ శైలి వైసీపీ నేతలకు కూడా నచ్చడం లేదని విమర్శ
తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో... రానున్న రోజుల్లో ఏపీలో వైసీపీ పరిస్థితి కూడా అలాగే ఉంటుందని టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితిని వైసీపీ కూడా ఎదుర్కొంటుందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వైసీపీ శ్రేణలు టీడీపీలో చేరుతున్నారని తెలిపారు. సీఎం జగన్ వ్యవహారశైలి, ఆయన వ్యక్తిత్వం నచ్చకే టీడీపీలో చేరుతున్నారని చెప్పారు. తనను ఎవరో ఏదో అన్నారని... వాళ్లకు కౌంటర్ ఇచ్చే శైలి తనది కాదని అన్నారు.
రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ ఉందని చెప్పారు. వైసీపీ నేతలను తాను బెదిరిస్తున్నానని అవంతి శ్రీనివాస్ చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. భయభ్రాంతులకు గురి చేస్తే పార్టీ మారుతారనేది ఒక భ్రమ అని చెప్పారు. అలాంటి పనులు వైసీపీనే చేస్తుందని అన్నారు. జగన్ వ్యవహారశైలి నచ్చక రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీలో చేరారని తెలిపారు.