గాడ్సే-గాంధీ సిద్ధాంతాల మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి: మంత్రి సీతక్క

  • మహబూబాబాద్ జనజాతర సభలో మాట్లాడిన మంత్రి సీతక్క
  • మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తోందని ఆరోపణ
  • దేవుడికి, భక్తుడికి అనుసంధానంగా ఉండే అగరబత్తిపై కూడా మోదీ పన్ను వేశారన్న మంత్రి
గాడ్సే-గాంధీ సిద్ధాంతాల మధ్య జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో నేటి గాంధీ మన రాహుల్ గాంధీకి ఓటు వేయాలని తెలంగాణ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు ఈ రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్నాయన్నారు. మహబూబాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ జనజాతర సభలో ఆమె మాట్లాడుతూ... మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తోందని ఆరోపించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే గ్యారంటీలకే గ్యారెంటీ అన్నారు. పేదల కష్టాలను తీర్చే పార్టీ కాంగ్రెస్ మాత్రమే అన్నారు. దేవుడికి, భక్తుడికి అనుసంధానంగా ఉండే అగరబత్తి పైన కూడా మోదీ పన్ను వేశారన్నారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో గాంధీ కుటుంబానికి అవకాశమివ్వాలని కోరారు. మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ గెలిస్తే కేంద్రమంత్రి అవుతారన్నారు.


More Telugu News