ఐపీఎల్: చెన్నైపై టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్
- ఐపీఎల్ లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ × లక్నో సూపర్ జెయింట్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో
- ఇంకా కోలుకోని సూపర్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్
ఐపీఎల్ లో ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఢీ కొంటున్నాయి. లక్నోలోని వాజ్ పేయి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన లక్నో జట్టు బౌలింగ్ ఎంచుకుంది. సీఎస్కే జట్టులో డారిల్ మిచెల్ స్థానంలో మొయిన్ అలీ తుదిజట్టులోకి వచ్చాడు. శార్దూల్ ఠాకూర్ స్థానంలో దీపక్ చహర్ వచ్చాడు.
అటు, లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో జోసెఫ్ స్థానంలో మాట్ హెన్రీకి అవకాశం ఇచ్చారు. సూపర్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ ఈ మ్యాచ్ లోనూ ఆడడం లేదు. టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్ ల్లో అమితవేగంతో బౌలింగ్ చేసి బ్యాట్స్ మన్లను బెంబేలెత్తించిన మయాంక్ అనూహ్యరీతిలో గాయపడ్డాడు. అతడి గాయంపై ఇంకా అప్ డేట్ రాలేదు.
టోర్నీలో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ 6 మ్యాచ్ ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ 6 మ్యాచ్ ల్లో 3 విజయాలతో ఐదో స్థానంలో నిలిచింది.