చంద్రబాబు తరపున కాసేపట్లో నామినేషన్ వేయనున్న భువనేశ్వరి

  • మధ్యాహ్నం 1.27 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్న భువనేశ్వరి
  • ప్రసన్న వరదరాజస్వామి ఆలయం, మసీదు, చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు
  • భారీగా తరలి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు
టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎప్పటి మాదిరే ఈసారి కూడా చంద్రబాబు స్వయంగా నామినేషన్ వేయడం లేదు. చంద్రబాబు తరపున ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మధ్యాహ్నం 1.27 గంటలకు కుప్పంలో రిటర్నింగ్ అధికారులకు భువనేశ్వరి నామినేషన్ పత్రాలను అందించనున్నారు. 

స్థానిక ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో చంద్రబాబు నామినేషన్ పత్రాలను ఉంచి భువనేశ్వరి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం లక్ష్మీపురంలో ఉన్న మసీదు ఆవరణలో ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత బాబూనగర్ లో ఉన్న చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. చంద్రబాబు నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు తరలి వచ్చాయి.


More Telugu News