తెలంగాణలో బీజేపీ నంబర్ వన్ కాబోతుంది.. తమిళనాడులో నన్ను ఓడించేందుకు రూ. 1000 కోట్ల ఖర్చు.. తమిళనాడు బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- కోయంబత్తూరు నుంచి బరిలో ఉన్న కె. అన్నామలై
- డీఎంకే, అన్నాడీఎంకే కలిసి తనను ఓడించేందుకు కుట్ర పన్నాయని ఆరోపణ
- తమిళనాడులో బీజేపీ ఓట్ షేర్ పెరుగుతోందని వ్యాఖ్య
- కర్ణాటకలో ఈసారి బీజేపీ క్లీన్ స్వీప్ చేయబోతోందని జోస్యం
తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై సంచలన ఆరోపణలు చేశారు. కోయంబత్తూరు నుంచి బరిలో నిలిచిన ఆయన అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకేపై ఆరోపణలతో విరుచుకుపడ్డారు. కరూర్ గ్రామంలోని ఉత్తుపాటి పోలింగ్ బూత్ లో ఓటుహక్కు వినియోగించుకున్న ఆయన అనంతరం మాట్లాడుతూ కోయంబత్తూరులో ఓటర్లను ప్రభావితం చేసేందుకు రెండు పార్టీలు కలిపి రూ. 1000 కోట్లు ఖర్చు చేశాయని ఆరోపించారు.
జూన్ 4న చారిత్రక తీర్పు రాబోతోందని చెప్పారు. తమిళనాడులో బీజేపీ ఓట్ షేర్ పెరుగుతోందని చెప్పారు. తమిళనాడు ప్రజలు మోదీతోనే ఉన్నారని, కర్ణాటకలోనూ ఈసారి బీజేపీ క్లీన్ స్వీప్ చేయబోతోందని చెప్పారు. తెలంగాణలోనూ పార్టీ నంబర్ వన్‌గా నిలబోతున్నదని జోస్యం చెప్పారు. తమిళనాడులో ఈసారి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయని, ద్రవిడియన్ రాజకీయాలకు కాలం చెల్లబోతుందని పేర్కొన్నారు.
కోయంబత్తూరులో అన్నామలైకి ప్రత్యర్థిగా అధికార డీఎంకే నుంచి పి.రాజ్‌కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. కాగా, రాష్ట్రంలోని 39 లోక్‌సభ స్థానాలకు నేడు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి.