బీఆర్ఎస్ కు మరో షాక్.. కాంగ్రెస్ లో చేరనున్న ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్
- సీఎం రేవంత్ ను కలిసిన రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్
- ఈరోజో, రేపో కాంగ్రెస్ లో చేరుతానని రేవంత్ కు చెప్పిన ప్రకాశ్
- రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న ప్రకాశ్ గౌడ్
లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యేగా ప్రకాశ్ గౌడ్ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈరోజు ప్రకాశ్ గౌడ్ కలిశారు. తన అనుచరులతో కలిసి ఈరోజో, రేపో కాంగ్రెస్ లో చేరుతానని రేవంత్ కు ప్రకాశ్ గౌడ్ తెలిపారు. రేవంత్ సమక్షంలోనే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
మరోవైపు ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ కీలక నేతలు కాంగ్రెస్, బీజేపీలో చేరారు. బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో... ఆ పార్టీ శ్రేణుల్లో కలవరం నెలకొంది. పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు బీఆర్ఎస్ అగ్రనేతలు యత్నిస్తున్నారు. అవసరమైతే కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేస్తామని ఓ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.