శ్రీకృష్ణుడి గోపికను నేనే: హేమమాలిని
- మథుర బీజేపీ లోక్‌సభ ఎంపీ అభ్యర్థిగా బరిలో హేమమాలిని
- గోపికల్లో ఒక గోపికగా తనను తాను ఊహించుకుంటానన్న సీనియర్ నటి
- కృష్ణుడికి బ్రిజ్‌వాసీలంటే ఎంతో ఇష్టమన్న బీజేపీ నేత
- వారికి సేవలందిస్తే శ్రీకృష్ణుడి ఆశీర్వాదం లభిస్తుందని వ్యాఖ్య
- శ్రీకృష్ణుడిని ఆరాధించే వారే బ్రిజ్‌వాసీలు
- బ్రిజ్‌వాసీలకు సేవలందించేందుకు మూడోసారి అవకాశమిచ్చిన బీజేపీకి హేమమాలిని కృతజ్ఞతలు
సీనియర్ నటి, బీజేపీ మథుర నియోజకవర్గ లోక్‌సభ ఎంపీ అభ్యర్థి హేమమాలిని తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు. కృష్ణుడికి మథుర చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన బ్రిజ్‌వాసీలంటే ఎంతో ఇష్టమని, వారికి సేవలందిస్తేనే ఆయన ఆశీర్వాదం పొందుతామని తన నమ్మకంగా ఆమె పేర్కొన్నారు. శ్రీకృష్ణుడిని ఆరాధించే వారిని బ్రిజ్‌వాసీలు అంటారు. తాను వారికి సేవలందిస్తున్నట్లు తెలిపారు.
పేరు, ప్రఖ్యాతుల కోసమో, మరే ఇతర భౌతిక లాభాపేక్షతోనో తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. మథుర పరిధిలోని 252 కిలోమీటర్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యంగా ఆమె పేర్కొన్నారు. గురువారం మథురలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రిజ్‌వాసీలకు సేవలందించేందుకు మూడోసారి అవకాశమిచ్చిన బీజేపీకి ఈ సందర్భంగా హేమమాలిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.