దుబాయ్‌లో భారీ వర్షాలు... హెల్ప్‌లైన్ నెంబర్లు విడుదల చేసిన దౌత్య కార్యాలయం
- ఏడున్నర దశాబ్దాలుగా ఎన్నడూలేని భారీ వర్షాలు కురవడంతో స్తంభించిన జనజీవనం
- విమానాశ్రయాల్లోనే ఉండిపోయిన వేలాదిమంది ప్రయాణికులు
- హెల్ప్ లైన్ నెంబర్లను విడుదల చేసిన దౌత్యకార్యాలయం
- +971501205172, +971569950590, +971507347676, +971585754213 నెంబర్లకు ఫోన్ చేయవచ్చునని వెల్లడి
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలమైంది. ఏడున్నర దశాబ్దాలుగా ఎన్నడూలేని భారీ వర్షాలు కురవడంతో జనజీవనం స్తంభించింది. వేలాదిమంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే ఉండిపోయారు. ఈ క్రమంలో దుబాయ్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం అక్కడి దౌత్య కార్యాలయం హెల్ప్ లైన్ నెంబర్లను విడుదల చేసింది. దుబాయ్‌లో ఎవరైనా చిక్కుకుపోతే +971501205172, +971569950590, +971507347676, +971585754213 నెంబర్లకు ఫోన్ చేయవచ్చునని తెలిపింది.
విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు అధికారులతో మాట్లాడినట్లు తెలిపింది. అక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. భారత్‌లోని తమ కుటుంబ సభ్యులతో ప్రయాణికులు మాట్లాడుకునేందుకు సదుపాయాలు కల్పించినట్లు తెలిపింది. దుబాయ్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ హెల్ప్ లైన్ నెంబర్లు కొనసాగుతాయని వెల్లడించింది.