మేం 12 సీట్లు గెలిస్తే రేవంత్ రెడ్డి కుర్చీని శ్రీరాముడే కాపాడాలి... అగస్ట్ వరకు ఉంటడో... ఉండడో: ధర్మపురి అర్వింద్
- అగస్ట్‌లో రుణమాఫీ చేస్తానని అంటున్నాడు కానీ... ఆయన ఉంటాడా? అని మీడియాలో చర్చ సాగుతోందని వ్యాఖ్య
- పదేళ్లలో మోదీ చేసిన అభివృద్ధిని చూసి బీజేపీకి ఓటేయాలని పిలుపు
- రేవంత్ రెడ్డి ఫాస్ట్... సమర్థత కలిగిన నాయకుడని కితాబు
- ఆయన బీజేపీలోకి వస్తే స్వాగతిస్తామని వ్యాఖ్య
- కాంగ్రెస్‌లో ఉండి రాజకీయ జీవితం పాడు చేసుకోవద్దని సూచన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ కనుక 12 లోక్ సభ స్థానాలు గెలిస్తే రేవంత్ రెడ్డి కుర్చీని ఇక శ్రీరాముడే కాపాడాలన్నారు. అసలు ఆయన అగస్ట్ వరకు కూడా ముఖ్యమంత్రిగా ఉంటారో.. ఉండరో తెలియదని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ... అప్పటి వరకు ఉంటాడో... ఉండరో తెలియని సీఎం అగస్ట్‌లో రుణమాఫీ ఎలా చేస్తారు? అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ కచ్చితంగా 12 సీట్లు గెలవబోతుందని జోస్యం చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ చరిత్ర అందరికీ తెలిసిందేనని అర్వింద్ అన్నారు. పదేళ్లలో ప్రధాని మోదీ చేసిన అభివృద్ధిని చూసి బీజేపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. సీఏఏ, ఎన్ఆర్సీ, యూసీసీ ఎందుకు అవసరమో ప్రజలకు వివరిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా 400 సీట్లు గెలవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని... వీటిని అరికట్టాలన్నారు. డిసెంబర్ నెలలో చెరుకు ఫ్యాక్టరీ తెరుస్తా... ఆరు గ్యారెంటీలు అగస్ట్‌లో అరెస్ట్ చేస్తా... అంటున్నారని... కానీ ఆయన అప్పటి వరకు ఉంటారా? అని మీడియాలో చర్చ సాగుతోందన్నారు.
ముఖ్యమంత్రిపై ప్రశంసలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అర్వింద్ ప్రశంసలు కురిపించారు. రేవంత్ రెడ్డి చాలా ఫాస్ట్... సమర్థత కలిగిన నాయకుడు అని కితాబునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజకీయ జీవితం పాడు చేసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. ఆయన బీజేపీలోకి వస్తే స్వాగతిస్తామన్నారు. సీనియర్లు ఆయనను చక్కగా పని చేసుకోనీయడం లేదన్నారు.