విరాట్ కోహ్లీ నాకు స్ఫూర్తి: సివిల్స్ టాపర్ అనన్య రెడ్డి
- సివిల్స్ లో మూడో ర్యాంక్ సాధించిన అనన్య రెడ్డి
- అనన్యది మహబూబ్ నగర్ జిల్లా
- కోహ్లీ డిసిప్లిన్ అమోఘమన్న అనన్య
2023 ఏడాదికి గాను యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన తెలుగు తేజం డోనూరు అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో 3వ ర్యాంకును సాధించి సత్తా చాటారు. సివిల్స్ లో తెలుగు బిడ్డ సత్తా చాటడంతో రెండు తెలుగు రాష్ట్రాలు మురిసిపోయాయి. మరోవైపు, తన విజయం గురించి అనన్య మీడియాతో మాట్లాడుతూ... టీమిండియా క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ తనకు స్ఫూర్తి అని తెలిపారు. విరాట్ కోహ్లీ తన ఫేవరెట్ క్రికెటర్ అని అనన్య చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటమిని అంగీకరించని తత్వం కోహ్లీది అని అన్నారు. కోహ్లీ డిసిప్లిన్ అమోఘమని కొనియాడారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయని స్వభావం కోహ్లీది అని... అదే తనకు స్ఫూర్తి అని చెప్పారు. మరోవైపు, ఇరుగు తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 50 మందికి పైగా సివిల్స్ లో సత్తా చాటారు.