కవిత అరెస్ట్‌పై స్పందించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

  • కవిత అరెస్ట్ ముమ్మాటికి అక్రమమేనని వ్యాఖ్య
  • మద్యం పాలసీ కుంభకోణంలో ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని విమర్శ
  • బీఎల్ సంతోష్ తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారని ఆరోపణ
  • బీఎల్ సంతోష్‌పై కేసు నమోదు చేసి నోటీసులు పంపించామన్న కేసీఆర్
  • అందుకే కవితను మద్యం కేసులో కుట్రపూరితంగా ఇరికించారని ఆగ్రహం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌పై ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారిగా స్పందించారు. కవిత అరెస్ట్ ముమ్మాటికి అక్రమమే అన్నారు. మద్యం పాలసీ కుంభకోణంలో ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని విమర్శించారు. బీఎల్ సంతోష్ తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దీంతో తాము బీఎల్ సంతోష్‌పై కేసు నమోదు చేసి నోటీసులు పంపించామన్నారు. అందుకే కవితను మద్యం కేసులో కుట్రపూరితంగా ఇరికించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. తాము అప్పుడు బీఎల్ సంతోష్‌కు నోటీసులు జారీ చేశామని, పోలీసులు బీజేపీ కేంద్ర కార్యాల‌యానికి వెళ్లినట్లు తెలిపారు. ఈ క్ర‌మంలోనే దుర్మార్గుడైన ప్రధాని నరేంద్ర మోదీ... బీఆర్ఎస్‌పై క‌క్ష కట్టారన్నారు. క‌విత‌పై ఎలాంటి కేసు లేదు... క‌క్ష క‌ట్టి అరెస్ట్ చేశారని విమర్శించారు. అందుకే క‌విత‌ను కుట్ర‌పూరితంగా మ‌నీలాండ‌రింగ్ కేసులో ఇరికించార‌న్నారు.


More Telugu News