వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రస్తావించిన విశాల్!

  • విశాల్ హీరోగా రూపొందిన 'రత్నం'
  • ఈ నెల 26వ తేదీన విడుదల
  • రానా తన బెస్ట్ ఫ్రెండ్ అని వెల్లడి   
  • వరలక్ష్మితో ఉన్నది ఫ్రెండ్షిప్ మాత్రమేనని వ్యాఖ్య

విశాల్ తన సినిమాలను తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేస్తూ ఉంటాడు. అందువలన ఆయనను తమిళ హీరోగా ఇక్కడి ప్రేక్షకులు భావించరు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'రత్నం' సినిమా ఈ నెల 26వ తేదీన ఇక్కడి థియేటర్లకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన బిజీగా ఉన్నాడు. అందులో భాగంగా ఆయన సుమన్ టీవీతో మాట్లాడాడు. 

"తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి రానా నాకు బెస్ట్ ఫ్రెండ్. చాలా ఏళ్లుగా మా మధ్య ఫ్రెండ్ షిప్ కొనసాగుతోంది. వరలక్ష్మి శరత్ కుమార్ నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. ఇండస్ట్రీలో చాలామందికి టాలెంట్ ఉంటుంది. కానీ వాళ్లలో కొంతమందికి మాత్రమే అవకాశం వస్తుంది. మిగతా వాళ్లు సరైన అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలా వెయిట్ చేసిన నటిగా వరలక్ష్మి గురించి చెప్పుకోవచ్చు" అని అన్నాడు. 

" తమిళ ఇండస్ట్రీ కంటే తెలుగులో వరలక్ష్మికి మంచి అవకాశాలు వచ్చాయి. తానేమిటనేది ఆమె నిరూపించుకునే ఛాన్స్ ఇచ్చింది. ఆమెకి ఇక్కడ ఈ స్థాయి గుర్తింపు రావడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. రెగ్యులర్ గా టచ్ లో లేకపోయినా మెసేజెస్ చేసుకుంటూనే ఉంటాము. పెళ్లి అనేది  వేరే ఈక్వేషన్ .. మా మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ మాత్రమే. ఒకరి సినిమాను గురించి ఒకరం మాట్లాడుకుంటూనే ఉంటాము" అని చెప్పాడు. 


More Telugu News