కాంగ్రెస్ 20 ఏళ్లయినా రాహుల్‌యాన్‌ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్‌నాథ్ సింగ్
- రాహుల్‌యాన్ ఇంకా లాంచ్ కాలేదని, ఎక్కడా ల్యాండ్ కాలేదని ఎద్దేవా
- అమేథి నుంచి పోటీ చేసేందుకు రాహుల్ గాంధీకి ధైర్యం లేదన్న రాజ్‌నాథ్ సింగ్
- ఈసారి వయనాడ్‌లో కూడా రాహుల్ గాంధీ ఓడిపోతారని జోస్యం
బీజేపీ అయిదేళ్లలో గగన్‌యాన్ ప్రారంభించబోతోందని... కానీ కాంగ్రెస్ గడిచిన 20 ఏళ్లలో కూడా రాహుల్‌యాన్‌ను లాంచ్ చేయలేకపోయిందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎద్దేవా చేశారు. గురువారం ఆయన కేరళలోని పతనంతిట్టలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత ఏకే ఆంటోనీ తనయుడు, బీజేపీ అభ్యర్థి అనిల్ ఆంటోనీ తరఫున ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాహుల్‌యాన్ ఇంకా లాంచ్ కాలేదని, ఎక్కడా ల్యాండ్ కాలేదన్నారు. అమేథి నుంచి పోటీ చేసేందుకు రాహుల్ గాంధీకి ధైర్యం లేదన్నారు.
2019లో అమేథీ స్థానం నుంచి ఓడిపోయిన రాహుల్ గాంధీ అక్కడ నుంచి మరోసారి పోటీకి భయపడుతున్నారన్నారు. లోక్ సభ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసే ధైర్యం ఆయనకు లేదన్నారు. అందుకే రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ నుంచి కేరళకు వలస వచ్చారని విమర్శించారు. ఈసారి వయనాడ్ నుంచి కూడా రాహుల్ గాంధీ గెలవరని జోస్యం చెప్పారు. ఆయనను ఎంపీని చేయకూడదని వయనాడ్ ప్రజలు నిర్ణయించుకున్నట్లు తాను విన్నానని పేర్కొన్నారు.