నారా లోకేశ్ తరఫున నామినేషన్ దాఖలు చేసిన కూటమి నేతలు

  • ఏపీలో నేటి నుంచి నామినేషన్లు
  • లోకేశ్ తరఫున నామినేషన్ వేసిన కూటమి నేతలు
  • లోకేశ్ నామినేషన్ పత్రాలకు మొదట ఆలయంలో పూజలు
  • కార్పొరేషన్ కార్యాలయం వరకు మూడు పార్టీల శ్రేణుల భారీ ర్యాలీ 
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థి నారా లోకేశ్ తరఫున ఎన్డీయే కూటమి నేతలు నేడు నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా తరలి వచ్చిన కూటమి నేతలు మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి రెండు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. 

అంతకుముందు, లోకేశ్ నామినేషన్ పత్రాలకు టీడీపీ-జనసేన-బీజేపీ నేతలు స్థానిక ఆలయంలో పూజలు జరిపించారు. ఆపై సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయం వరకు మూడు పార్టీల శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టాయి. లోకేశ్ నామినేషన్ సందర్భంగా మంగళగిరి పట్టణంలోని రహదారి జనసంద్రంలా మారింది. స్థానిక మిద్దె సెంటర్, సీతారామస్వామి కోవెల సెంటర్ మధ్య మూడు పార్టీ జెండాలతో కోలాహలం మిన్నంటింది. ఈ ర్యాలీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు కదం తొక్కాయి.

కాగా, నారా లోకేశ్ నామినేషన్ దాఖలుకు తమిళనాడులోని శ్రీరంగనాథ స్వామి ఆలయ పూజారులు ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తోంది.


More Telugu News