తెలంగాణకు కేంద్రం పదేళ్లలో రూ.10 లక్షల కోట్లు కేటాయించింది: కిషన్ రెడ్డి
- తనపై ఇప్పటి వరకు ఒక్క అవినీతి మచ్చ లేదన్న కిషన్ రెడ్డి
- తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదన్న కేంద్రమంత్రి
- తనపై విమర్శలు చేసిన వారికి ప్రజలు గతంలోనే బుద్ధి చెప్పారన్న కిషన్ రెడ్డి
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్రమంత్రి, ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తనపై ఇప్పటి వరకు ఒక్క అవినీతి మచ్చ లేదన్నారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదన్నారు. తాను ఎవరినీ బెదిరించలేదని... ఎవరిపైనా పక్షపాత ధోరణితో వ్యవహరించలేదన్నారు.
తనపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై విమర్శలు చేసిన వారికి ప్రజలు గతంలోనే బుద్ధి చెప్పారన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి అభివృద్ధి కోసం పని చేశానని భావిస్తేనే ఓటేయాలన్నారు. తనను మళ్లీ గెలిపించి ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.