ఒకే కారులో తెలంగాణ భవన్‌కు వచ్చిన కేటీఆర్, హరీశ్ రావు

ఒకే కారులో తెలంగాణ భవన్‌కు వచ్చిన కేటీఆర్, హరీశ్ రావు
  • అదే కారులో వచ్చిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
  • హరీశ్ రావు, కేటీఆర్‌లకు ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ కార్యకర్తలు
  • సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒకే కారులో కలిసి వచ్చారు. హరీశ్ రావు, కేటీఆర్‌లకు బీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు, ముఖ్యనేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేసీఆర్ పదిహేడు లోక్ సభ నియోజకవర్గాల అభ్యర్థులకు బీఫామ్‌లు అందజేయనున్నారు.

ఈ సందర్భంగా ఎన్నికల్లో ప్రచారం, అనుసరించే వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ప్రధానంగా తాను చేపట్టే బస్సు యాత్ర రూట్ మ్యాప్‌పై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.


More Telugu News