నామినేషన్ దాఖలు చేసిన ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, శానంపూడి
- మహబూబ్ నగర్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన డీకే అరుణ
- మెదక్ లోక్ సభ నుంచి నామినేషన్ దాఖలు చేసిన రఘునందన్ రావు
- నల్గొండ నుంచి శానంపూడి తరఫున నామినేషన్ పత్రాలు సమర్పించిన మాదగోని
పలువురు బీజేపీ అభ్యర్థులు ఆయా లోక్ సభ స్థానాల నుంచి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. మల్కాజ్‌గిరి లోక్ సభ స్థానానికి ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు. మేడ్చల్ కలెక్టరేట్‌లో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మహబూబ్ నగర్ కలెక్టరేట్‌లో మహబూబ్ నగర్ లోక్ సభ అభ్యర్థిగా డీకే అరుణ, మెదక్ లోక్ సభ అభ్యర్థిగా రఘునందన్ రావు, నల్గొండ లోక్ సభ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తరఫున మాదగోని శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ... ఈ ఎన్నికలు ప్రత్యేక వాతావరణంలో జరుగుతున్నాయన్నారు. 50 రోజులుగా ప్రజల అభిప్రాయాలు వింటున్నామన్నారు. ఫిర్ ఏక్ బార్... మోదీ సర్కార్ అని ప్రజలు నినదిస్తున్నారన్నారు. ఎక్కడ చూసినా అబ్ కీ బార్... చార్ సౌ పార్ నినాదాలే వినిపిస్తున్నాయన్నారు. మోదీ ఉంటేనే దేశ రూపురేఖలు మారుతాయని జనం అంటున్నారన్నారు. మోదీ పాలన వల్లే భారతీయులకు విదేశాల్లో గౌరవం పెరిగిందన్నారు.