‘లచ్చుమక్క.. అర్చనక్కా’ అంటూ ‘జితేందర్‌రెడ్డి’ నుంచి మరో లిరికల్ సాంగ్.. మంగ్లీ గొంతుకు ఫిదా!
- 1980ల నాటి వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ‘జితేందర్‌రెడ్డి’
- అద్భుతమైన గాత్రంతో అదరగొట్టిన గాయని మంగ్లీ
- మే 3న థియేటర్లకు రానున్న సినిమా
1980లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ‘జితేందర్‌రెడ్డి’ సినిమా నుంచి మరో సాంగ్ వచ్చేసింది. గతవారం ‘అఆఇఈఉఊ.. ’ అంటూ కాలేజీ బ్యాక్‌డ్రాప్ లో చిత్రీకరించిన పాటను రిలీజ్ చేశారు. మాస్ బీట్‌తో ఆకట్టుకునేలా ఉన్న ఈ పాట అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘లచ్చుమక్కా.. అర్చనక్కా పిల్ల సూడండే సిగ్గులల్ల సీతలెక్క సక్కగున్నాదే..’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. వివాహానికి సంబంధించిన నేపథ్యంలో ప్రముఖ గాయని మంగ్లీ పాడిన ఈ పాట లిరిక్స్ హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి.
ముదుగంటి క్రియేషన్స్‌పై నిర్మించిన ఈ చిత్రానికి ముదుగంటి రవీందర్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వం వహించారు. రాకేశ్ వర్రె లీడ్ రోల్ పోషించగా రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాశ్ ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. మే 3న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.