చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100వ సారి రక్తదానం.. ఇంటికి పిలిచి దాతను సన్మానించిన మెగాస్టార్.. వీడియో ఇదిగో!
- బ్లడ్ బ్యాంక్ ప్రారంభించిన నాటి నుంచి మహర్షి రాఘవ రక్తదానం
- ప్రతీ మూడు నెలలకు ఒకసారి రక్తం ఇస్తున్న నటుడు
- 26 ఏళ్లుగా ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టిన బ్లడ్ బ్యాంక్
మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ కు ఆయన అభిమానులతో పాటు తోటి నటీనటులు కూడా మద్దతుగా నిలబడుతున్నారు. చిరుపై అభిమానంతో రక్తదానం చేస్తూ బ్లడ్ బ్యాంకు ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడేందుకు తోడ్పడుతున్నారు. 1998 అక్టోబర్ 2వ తేదిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రారంభం కాగా.. తొలుత రక్తం ఇచ్చిన వ్యక్తి మురళీ మోహన్, రెండో వ్యక్తి నటుడు మహర్షి రాఘవ.. అప్పటి నుంచి మహర్షి రాఘవ వరుసగా రక్త దానం చేస్తూ వస్తున్నారు. ఇటీవల 100వ సారి రక్త దానం చేసి రికార్డు క్రియేట్ చేశారు. వందవ సారి రక్తదానం చేసేటపుడు తాను కూడా వస్తానని మెగస్టార్ చిరంజీవి గతంలో మహర్షి రాఘవకు మాటిచ్చారు.
అయితే, ఆ సమయంలో చెన్నైలో ఉండడంతో మెగాస్టార్ రాలేకపోయారు. చెన్నై నుంచి వచ్చిన వెంటనే మహర్షి రాఘవను ఇంటికి పిలిపించుకున్న చిరంజీవి.. ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. వందసార్లు రక్త దానం చేయడం చాలా గొప్ప విషయమని రాఘవను మెచ్చుకున్నారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి రక్త దానం చేస్తూ రావడం మామూలు విషయం కాదంటూ రాఘవ సేవాగుణాన్ని కొనియాడారు. మహర్షి రాఘవతో పాటు ఆయన భార్య శిల్ప, ప్రముఖ నటుడు మరళీమోహన్ కూడా మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. రాఘవను ఆయన కూడా అభినందించారు.