మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల నామినేషన్ పత్రాలకు పూజలు

  • తెలంగాణలో నేటి నుంచి నామినేషన్లు 
  • ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరణ
  • శామీర్‌పేట కట్టమైసమ్మ ఆలయంలో ఈటల నామినేషన్ పత్రాలకు పూజలు
  • అమ్మవారి పాదాల చెంత ఉంచి పూజలు చేసిన ఆయన భార్య జమున
తెలంగాణలో నేటి నుంచి లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. నేతల్లో హడావుడీ మొదలైంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆయా పార్టీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. నామినేషన్ వేస్తే పెద్ద పనైపోతుందని, ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవచ్చన్న భావనలో ఉన్నారు. నేడు తొలి రోజు పలు పార్టీల నాయకులు నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇకపై రాజకీయం మరింత వేడెక్కే అవకాశం ఉంది.

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ పత్రాలను ఆయన భార్య జమున ఈ ఉదయం శామీర్‌పేట కట్టమైసమ్మ ఆలయంలో అమ్మవారి చెంత నామినేషన్ పత్రాలను ఉంచి పూజలు నిర్వహించారు. 

అనంతరం జమున మాట్లాడుతూ.. మల్కాజిగిరిలో రాజేందర్ అత్యధిక సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని తెలిపారు. మాల్కాజిగిరి అభివృద్ధి కోసం అందరూ బీజేపీకి ఓటేయాలని కోరారు.


More Telugu News