నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు.. శిఖర్ ధావన్ ఎమోషనల్ పోస్ట్..!
- మరోసారి కుమారుడు జోరావర్‌ను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన భారత క్రికెటర్
- పంజాబ్ జెర్సీపై కొడుకు పేరుతో ఇన్‌స్టాలో ఫొటోలు పంచుకున్న వైనం
- భార్యతో విడాకుల తర్వాత కుమారుడికి దూరమైన ధావన్
భారత డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి తన కుమారుడు జోరావర్‌ను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. 'నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావ్ మై బాయ్..' అంటూ పంజాబ్ జెర్సీపై తన కొడుకు పేరుతో పాటు నం.01 అంకెను ముద్రించాడు. ఈ జెర్సీని ధరించి ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఇప్పుడీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక గతంలో కూడా శిఖర్ ధావన్ తన కుమారుడిని చూసి ఏడాది అవుతోందంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.
కాగా, శిఖర్ ధావన్ తన భార్య ఆయేషా ముఖర్జీతో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ధావన్ కొడుకు మైనర్ కావడంతో బాబు తల్లి దగ్గరే ఉండాలని కోర్టు తీర్పునిచ్చింది. ఇక ఆయేషా ముఖర్జీ ఆస్ట్రేలియన్ పౌరురాలు కావడంతో ఆమె కుమారుడిని తీసుకుని అక్కడికి వెళ్లిపోయింది. న్యాయస్థానం ధావన్‌కు కుమారుడిని చూసుకునేందుకు అనుమతి ఇచ్చినా.. ఆమె మాత్రం కనీసం వీడియో కాల్‌లో అయినా అతనికి తన కొడుకునే చూసుకునేందుకు అంగీకరించడం లేదు.
దీంతో శిఖర్ ధావన్ తన కుమారుడు జోరావర్ దూరం కావడంతో తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నాడు. తరచూ జోరావర్‌ను గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతున్నాడు. ఇక ప్రస్తుతం ఐపీఎల్‌లో ధావన్ పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆ జట్టు సారధిగా కొనసాగుతున్నాడు.