లోక్‌సభ ఎన్నికల 4వ దశ గెజిట్ విడుదల!

  • నామినేషన్ల స్వీకరణకు ఏప్రిల్ 25 చివరి తేదీ
  • ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన
  • నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 వరకూ గడువు
  • మే 13న పది రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్
నాలుగవ దశ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ దశలో మొత్తం 10 రాష్ట్రాల్లోని 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీ, బీహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూకశ్మీర్‌లో నాలుగవ దశ ఎన్నికలు జరుగుతాయి. 

ప్రభుత్వ గెజిట్ ప్రకారం, ఈ దశ నామినేషన్ల స్వీకరణకు ఏప్రిల్ 25 చివరి తేదీ. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 చివరి తేదీ కాగా, మే 13న 96 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం ఏడు దశల్లో ఈ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. తొలి దశలో అత్యధికంగా 102 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. చివరి దశలో 57 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి.


More Telugu News