అసెంబ్లీ ఎన్నికల సమయంలో కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదని కాంగ్రెస్సే అడిగింది: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
- బీఆర్ఎస్ తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయిందన్న లక్ష్మణ్
- లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కూడా తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం
- బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం ఉందని అబద్దపు ప్రచారం చేసి కాంగ్రెస్ గెలిచిందని వ్యాఖ్య
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు అడిగారని... ఇప్పుడేమో కేసీఆర్, రేవంత్ రెడ్డి డూప్ ఫైటింగ్ చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ ఇప్పటికే తెలంగాణలో తుడిచిపెట్టుకు పోయిందని వ్యాఖ్యానించారు. లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కూడా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు కాంగ్రెస్ నేతలు ప్రజల ఆగ్రహాన్ని చూస్తున్నారన్నారు.
కాంగ్రెస్ నేతలు అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతున్నారని విమర్శించారు. బీజేపీని ఎదుర్కోవడానికి కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు. వాళ్లు చేసేది అంతా డూప్ ఫైటింగ్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం ఉందని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అబద్ధపు ప్రచారం చేసి లబ్ధి పొందిందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి డబుల్ డిజిట్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.