ఖాళీ బిందెలతో ధర్నాలు... ట్యాంకర్ల కోసం ఎదురు చూపులు: హరీశ్ రావు
- రాష్ట్రం గొంతెండిపోతోందని, నీళ్ల కోసం ప్రజలు రోడ్డెక్కుతున్నారని విమర్శ
- కేసీఆర్ హయాంలో ఇలాంటి దృశ్యాలు ఎప్పుడూ... ఎక్కడా కనిపించలేదన్న హరీశ్
- కాంగ్రెస్ పాలనలో నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయని వ్యాఖ్య
కాంగ్రెస్ పాలనలో మళ్లీ పాత రోజులు కనిపిస్తున్నాయని... ఖాళీ బిందెలతో ధర్నాలు, ట్యాంకర్ల కోసం ఎదురు చూపులు చూస్తున్నామని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రం గొంతెండిపోతోందని, నీళ్ల కోసం ప్రజలు రోడ్డెక్కుతున్నారన్నారు. కేసీఆర్ హయాంలో ఇలాంటి దృశ్యాలు ఎప్పుడూ... ఎక్కడా కనిపించలేదన్నారు.
కాంగ్రెస్ పాలనలో నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో తండాల్లో కూడా మిషన్ భగీరథ జలధార వచ్చేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పంటలకు కూడా సాగునీరు ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రజలకు కనీసం మంచినీళ్లయినా ఇవ్వాలని కోరుతున్నానన్నారు.