ఢిల్లీ నీటి సమస్యపై జైల్లో ఉన్న కేజ్రీవాల్‌కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ

  • నీటి కొరత సమస్యలు పరిష్కరించడంలో కేజ్రీవాల్ ప్రభుత్వం విఫలమైందని విమర్శ
  • దశాబ్దకాలంగా నగరంలో మంచి నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్న ఎల్జీ
  • ఢిల్లీలో నీటి సమస్య ఇప్పటికిప్పుడు వచ్చింది కాదని వ్యాఖ్య
మద్యం పాలసీ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ అంశంలో తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా లేఖ రాశారు. ఢిల్లీలోని తాగునీటి సమస్యపై ఆయన ఈ బహిరంగ లేఖ రాశారు. నగరంలో నీటి కొరత సమస్యలను పరిష్కరించడంలో కేజ్రీవాల్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. గత దశాబ్దకాలంగా నగరంలో మంచి నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు ఏమీ తీసుకోలేదని పేర్కొన్నారు. 

ఢిల్లీలో నీటి సమస్య ఇప్పటికిప్పుడు వచ్చింది కాదన్నారు. ప్రతి సంవత్సరం ఇదే సమస్య పునరావృతమవుతోందన్నారు. అంతేకాదు, ఢిల్లీలో మంచినీటి సమస్యపై 2017 నుంచి మీడియాలో వచ్చిన క్లిప్పింగ్స్‌ను ఈ లేఖకు ఆయన జత చేశారు. ఢిల్లీలో నీటి సమస్య తీవ్రతను వివరించారు. నీటి నిర్వహణ విషయంలో ఢిల్లీ కంటే చెన్నై (35 శాతం), ముంబై (27 శాతం), పూణే (35 శాతం) నగరాలు బెట్టర్‌గా ఉన్నట్లు పేర్కొన్నారు.


More Telugu News