టీ20 ప్రపంచకప్‌కు హార్దిక్ పాండ్యా ఎంపిక కష్టమేనా?.. స్పష్టమైన మెసేజ్ పంపిన బీసీసీఐ
- ఐపీఎల్‌లో కష్టకాలం ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యా
- అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ తేలిపోతున్న ముంబై కెప్టెన్
- రెగ్యులర్‌గా బౌలింగ్ చేస్తే ఆలోచిస్తామంటూ కచ్చితమైన నిబంధన
- హార్దిక్ ప్లేస్ కోసం పోటీపడుతున్న శివందూబే
టీమిండియా స్టార్ బ్యాటర్ హార్దిక్ పాండ్యా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కష్టకాలం ఎదుర్కొంటున్నాడు. ముంబై ఇండియన్స్‌కు సారథ్యం వహిస్తున్న హార్దిక్ ఇప్పటి వరకు ప్రభావం చూపలేకపోయాడు. ఇప్పటి వరకు ఆరు మ్యాచుల్లో 26.20 సగటుతో 131 పరుగులు మాత్రమే చేశాడు. నాలుగు మ్యాచుల్లో బౌలింగ్ చేసి ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఓ మ్యాచ్‌లో పవర్‌ప్లేలో నాలుగు ఓవర్లు వేసి 44 పరుగులు ఇచ్చుకున్నాడు. మిడిల్ ఓవర్లలో 6 ఓవర్లలో 62 పరుగులు, ఓ డెత్ ఓవర్‌లో ఏకంగా 26 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ కప్ జట్టులో అతడి చోటు ప్రశ్నార్థకమైంది. జట్టుకు ఎంపిక కావాలంటే ఏం చేయాలో చెబుతూ బీసీసీఐ సెలక్షన్ కమిటీ పాండ్యాకు ఆంక్షలు విధిస్తూ స్పష్టమైన సందేశం పంపినట్టు తెలిసింది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. ముంబైలో గతవారం టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్‌శర్మ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యా ఎంపిక విషయమై చర్చ జరిగింది. టీ20 ప్రపంచకప్ జట్టుకు పాండ్యా ఎంపిక కావాలంటే రెగ్యులర్‌గా బౌలింగ్ చేయాల్సిన అవసరాన్ని మేనేజ్‌మెంట్ నొక్కి చెప్పింది.
పాండ్యా స్థానంలో దూబే!
హార్దిక్ స్థానం కోసం పోటీపడుతున్న వారిలో శివందూబే పేరు టాప్‌లో ఉంది. ఐపీఎల్‌లో చెన్నైకి ప్రాతినిధ్యం వహిస్తున్న దూబే విషయంలోనూ ఓ సమస్య ఉంది. సీఎస్కే జట్టు అతడిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే వినియోగించుకుంటోంది. దూబే ఆల్‌రౌండర్ అయినప్పటికీ ఈ సీజన్‌లో జట్టు అతడితో ఇప్పటి వరకు బౌలింగ్ చేయించలేదు. లెఫ్టాండ్ బ్యాటర్ అయిన దూబే పవర్ హిట్టింగ్‌తో స్పిన్నర్లపై విరుచుకుపడుతున్నాడు. ఒకవేళ అతడిని కనుక జట్టుకు ఎంపిక చేస్తే అతడిని ఫుల్‌టైం ఆల్‌రౌండర్‌లా కాకుండా పార్ట్‌టైం బౌలర్‌గా ఉపయోగించుకునే అవకాశం ఉంది.