లింక్డ్ ఇన్ ‘ఉత్తమ పెద్ద కంపెనీల’లిస్ట్ లో టీసీఎస్ , యాక్సెంచర్, కాగ్నిజెంట్
- లెంట్రా, నైకా, డ్రీమ్ 11, మేక్ మై ట్రిప్ లాంటి మిడ్ సైజ్ సంస్థలకూ చోటు
- కెరీర్ పురోగతిపై ప్రభావం చూపించే 8 అంశాల ఆధారంగా కంపెనీలకు ర్యాంకింగ్ లు
- యువత నుంచి కంపెనీలు ఎలాంటి నైపుణ్యాలు కోరుకుంటున్నాయో తెలిపిన సర్వే
దేశంలో పనిచేయాలని అత్యధిక మంది కోరుకొనే కంపెనీల్లో ఒకటిగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన హవా కొనసాగిస్తోంది. ప్రముఖ వ్యాపార, ఉద్యోగ కల్పన సోషల్ మీడియా సంస్థ లింక్డ్ ఇన్ రూపొందించిన టాప్ కంపెనీల వార్షిక జాబితాలో టీసీఎస్ తొలి స్థానంలో నిలిచింది. యాక్సెంచర్, కాగ్నిజెంట్ వరుసగా రెండు, మూడో స్థానాలు సాధించాయి. టాప్ ర్యాంకులు సాధించడం ద్వారా టెక్నాలజీ రంగంలో తమ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకున్నాయి. కెరీర్ పురోగతిపై ప్రభావం చూపగల 8 కీలకాంశాల ఆధారంగా కంపెనీలకు లింక్డ్ ఇన్ వార్షిక ర్యాంకులు ప్రకటించింది. అందులో వృత్తిపరమైన అభివృద్ధికి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, కంపెనీ స్థిరత్వం, బయటి అవకాశాలకు ప్రవేశం, ఉద్యోగి సంతృప్తి, ఉద్యోగాల్లో భిన్నత్వం, ఉద్యోగుల విద్యార్హతలు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో కంపెనీ విస్తరణ ఉన్నాయి.
చోటు దక్కించుకున్న ఆర్థిక సేవల సంస్థలు
లింక్డ్ ఇన్ 2024 జాబితాలో ఆర్థిక సేవల కంపెనీలకు ఎక్కువగా చోటు లభించింది. మొత్తం 25 అతిపెద్ద కంపెనీల్లో 9 కంపెనీలు ఈ రంగానికి చెందినవే ఉన్నాయి. ఈ జాబితాలో మెక్ క్వైరీ (4వ స్థానం), స్టాన్లే (5వ స్థానం), జేపీ మోర్గాన్ చేస్ అండ్ కంపెనీ (6వ స్థానం) నిలిచాయి.
టెక్నాలజీ, ఫైనాన్స్
లింక్డ్ ఇన్ ర్యాంకుల్లో దిగ్గజ కంపెనీలతోపాటు మరికొన్ని కంపెనీలు ఉన్నాయి. టాప్ 15 మిడ్ సైజ్ కంపెనీలకు ఇందులో స్థానం లభించింది. సాఫ్ట్ వేర్ సేవల ప్లాట్ఫాం లెంట్రా తొలి స్థానం సంపాదించగా ఆన్ లైన్ ట్రావెల్ దిగ్గజ సంస్థ మేక్ మై ట్రిప్ ఆ తర్వాతి స్థానాన్ని పొందింది. అలాగే ఫ్యాషన్, బ్యూటీ రంగం నుంచి నైకా, ఫాంటసీ క్రీడల రంగం నుంచి డ్రీమ్ 11 ఇందులో చోటు దక్కించుకున్నాయి. ఈ జాబితాలో నిలిచిన ఏకైక ఎఫ్ ఎంసీజీ కంపెనీ పెప్సీకో.
నైపుణ్యాలకు డిమాండ్
వివిధ రంగాలు కోరుకుంటున్న నైపుణ్యాలను లింక్డ్ ఇన్ డేటా తెలియజేసింది. దీని ప్రకారం ఆర్థిక సేవల సంస్థలు ఇన్వెస్టర్ రిలషన్స్, క్యాపిటల్ మార్కెట్లు, ఇన్వెస్ట్ మెంట్ బ్యాకింగ్ లలో నైపుణ్యాలకు కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. అలాగే టెక్నాలజీ రంగంలో సాఫ్ట్ వేర్, డేటా స్టోరేజీ, సాఫ్ట్ వేర్ అభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు అధిక డిమాండ్ ఉంది. అలాగే ఆదాయ విశ్లేషణ, లాభేతర నిర్వహణ, మొబైల్ అప్లికషన్ల అభివృద్ధి వంటి నైపుణ్యాలకు కూడా వివిధ రంగాల నుంచి అధిక డిమాండ్ వస్తోంది.
టాలెంట్ హబ్ గా బెంగళూరు
ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు ఈ జాబితాలో టాలెంట్ హబ్ గా నిలిచింది. ఈ నగరంలో అత్యధికంగా ఉన్న కంపెనీలు నిపుణుల కోసం ఎక్కువగా వెతుకుతున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో హైదరాబాద్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, పూణే నిలిచాయి.