వాహనాల్లో డ్రైవర్ల కుటుంబసభ్యుల చిత్రాలు.. రోడ్డు ప్రమాదాల నివారణకు ఏపీని అనుసరిస్తున్న యూపీ
- రోడ్డు ప్రమాదాల నివారణకు యూపీ రవాణా శాఖ కొత్త ప్రయోగం
- వాహనాల డ్యాష్ బోర్డులపై కుటుంబసభ్యుల చిత్రాలు పెట్టుకోవాలంటూ డ్రైవర్లకు విజ్ఞప్తి
- ఏపీ ప్రభుత్వం విధానం విజయంతో యూపీలోనూ అమలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ఉత్తరప్రదేశ్ రోడ్డు రవాణా శాఖ సరికొత్త విధానానికి తెరతీసింది. కమర్షియల్ వాహనాలు, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ బస్సులు నడిపే డ్రైవర్లు తమ వాహనాల డ్యాష్ బోర్డులపై కుటుంబసభ్యుల ఫొటోలను పెట్టుకోవాలని సూచించింది. ఈ మేరకు రవాణా శాఖ కమిషనర్ చంద్ర భూషణ్ సింగ్ డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న విధానాన్ని యూపీలోనూ అవలంబించాలని నిర్ణయించినట్టు ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎల్. వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ ఐడియా ఏపీలో మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు. ‘‘డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటూ ఆ ఫొటోలు నిరంతరం గుర్తు చేస్తాయి’’ అని వ్యాఖ్యానించారు. ఈ విధానంలో ఏపీలో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గిందని యూపీ అధికారులు తెలిపారు. యూపీలో 2022తో పోలిస్తే 2023లో రోడ్డు ప్రమాదాలు 4.7 శాతం మేర పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది.