వైఎస్ జగన్ అంటే అభిమానం.. హీరో విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

వైఎస్ జగన్ అంటే అభిమానం.. హీరో విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • వైఎస్ జగన్ మరోసారి సీఎం అవుతారన్న నటుడు
  • తాను వైసీపీ మద్దతుదారుడిని కాదని, జగన్ అంటే అభిమానమని వెల్లడి
  • సినిమాలు, రాజకీయాలను బ్యాలెన్స్ చేయడం కష్టమని వ్యాఖ్య
ప్రముఖ నటుడు విశాల్ ఏపీ రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోస్యం చెప్పాడు. వైసీపీకి తాను మద్దతుదారుడిని కాదని, అయితే జగన్ అంటే తనకు అభిమానమని విశాల్ తెలిపాడు. రాజకీయ నాయకులు నటులుగా మారుతున్నారని, అందుకే నటులు కూడా పాలిటిక్స్‌లోకి వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించాడు. సినిమాలు, రాజకీయాలను బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమని, ఎక్కడో ఏసీ రూమ్‌లో కూర్చొని పాలిటిక్స్ చేయలేమని అభిప్రాయపడ్డాడు. రాజకీయాల్లోకి రావాలంటే కొన్ని విషయాలు పూర్తిగా మరచిపోవాలని అన్నాడు. 

జగన్‌పై రాయిదాడి ఘటనపై స్పందిస్తూ.. రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయని, జాగ్రత్తగా ఉండాలని, ఇకపై జాగ్రత్తగా ఉంటారని భావిస్తున్నానని విశాల్ చెప్పాడు. రత్నం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ  మీడియా సంస్థతో మాట్లాడుతూ విశాల్ ఈ వ్యాఖ్యలు చేశాడు.


More Telugu News