బుట్టా రేణుక పేదరాలు అంట!: ఎమ్మిగనూరులో బాలకృష్ణ
- రాయలసీమలో బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర
- ఎమ్మిగనూరులో ఎన్నికల ప్రచార సభ
- జగన్, బుట్టా రేణుకలను గెలిపిస్తే కోట్లకు పడగలెత్తుతారన్న బాలయ్య
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర రాయలసీమలో కొనసాగుతోంది. ఇవాళ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బాలకృష్ణ రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇక్కడి వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక పేదరాలు అని జగన్ అంటున్నారని, ఆ పేదరాలు డబ్బు సంచులతో వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తోందని వ్యంగ్యం ప్రదర్శించారు. ఆమె పేదరాలైతే, రూ.360 కోట్ల మేర రుణాలు చెల్లించాలని ఎల్ఐసీ ప్రకటన ఎలా ఇచ్చిందని బాలయ్య ప్రశ్నించారు.
జగన్ ను, బుట్టా రేణుకను ఎన్నికల్లో గెలిపిస్తే వాళ్లు కోట్లు సంపాదించుకుంటారని, జనం బికారులుగా మారతారని వ్యాఖ్యానించారు. జగన్ వల్ల ప్రపంచపటంలో ఏపీ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి వచ్చిందని విమర్శించారు.
అంతకుముందు, బాలయ్య తన లెజెండ్ సినిమాను ప్రస్తావించారు. ఎమ్మిగనూరులో లెజెండ్ సినిమా 400 రోజుల పాటు ప్రదర్శితమైందని, తద్వారా దేశ చరిత్రలో ఎమ్మిగనూరు నిలిచిపోయిందని వివరించారు. చరిత్ర సృష్టించాలన్నా తామే, చరిత్ర తిరగరాయాలన్నా తామేనని వ్యాఖ్యానించారు.