కొత్తగా ‘డ్రై ప్రమోషన్’ ట్రెండ్.. ఉద్యోగులకు కష్టకాలం!
- పేరుకే ప్రమోషన్లు ఇస్తున్న కంపెనీలు
- హోదాతో బాధ్యతలు, పని భారం పెరిగినా పాత వేతనమే..
- ఉద్యోగుల్లో మానసిక ఆందోళనకు దారితీస్తున్న తీరు
రంగం ఏదైనా సరే.. ఉద్యోగమేదైనా సరే.. ప్రమోషన్ అందుకోవడం ఉద్యోగుల లక్ష్యం. ప్రమోషన్ తో ఉద్యోగి హోదాతోపాటు శాలరీ కూడా పెరిగే అవకాశం ఉండటమే దీనికి కారణం. కానీ ఈ మధ్య కొత్తగా ‘డ్రై ప్రమోషన్’ ట్రెండ్ పెరిగిందని కార్పోరేట్ వర్గాలు చెప్తున్నాయి. అసలే కృత్రిమ మేధ దెబ్బకు ఉద్యోగాలపై ప్రభావం పడుతున్న సమయంలో ఇది మరో తలనొప్పిగా మారుతోందని అంటున్నాయి.
ఏమిటీ ‘డ్రై ప్రమోషన్’?
ఈ పేరులోనే ఉన్నట్టుగా ప్రమోషన్ వచ్చినట్టే కానీ ప్రయోజనం లేని పరిస్థితి. ఎందుకంటే ఈ మధ్య చాలా కంపెనీలు ఉద్యోగులకు ప్రమోషన్ ఇచ్చినా.. జీతాలు మాత్రం పాత స్థాయిలోనే ఉంటున్నాయి. అంతర్జాతీయ కంపెన్సేషన్ కన్సల్టెన్సీ సంస్థ పెర్ల్ మేయర్ ఇటీవల చేసిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. కంపెనీలు సుమారు 13 శాతం మంది ఉద్యోగులకు ఇలా ‘డ్రై ప్రమోషన్లు’ ఇస్తున్నట్టుగా తేలింది.
పని భారం.. జీతం దూరం..
కొంతకాలం నుంచి అంతర్జాతీయ స్థాయిలో పెద్ద కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి. ఖర్చు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో తొలగించిన, మానేసిన ఉద్యోగుల స్థానంలో వారికంటే కింది స్థాయిలో కాస్త మెరిట్ ఉన్న వారికి ప్రమోషన్లు ఇస్తున్నాయి. కానీ పెరిగిన హోదాకు తగినట్టుగా వేతనాలు పెంచడం లేదని అధ్యయనంలో తేలింది.
ఉద్యోగులలో ఆందోళన
‘డ్రై ప్రమోషన్’ ట్రెండ్ తో ఉద్యోగుల్లో ఆందోళన కనిపిస్తోంది. ప్రమోషన్ వచ్చిందన్న ఆనందం కంటే.. బాధే ఎక్కువగా ఉంటోందని వారు చెబుతున్నారు. ప్రమోషన్ తో బాధ్యతలు, పని భారం పెరుగుతున్నాయని.. మానసికంగా ఒత్తిడి పడుతోందని వాపోతున్నారు. ఒకవేళ తమకు ఆఫర్ చేసిన ప్రమోషన్ వద్దని కంపెనీకి చెబితే.. భవిష్యత్తులో సమస్యలు వస్తాయేమోనన్న ఆందోళన వెంటాడుతోందని అంటున్నారు.