పీఎఫ్ సీ ద్వారా రూ.7 వేల కోట్ల అప్పు కోసం ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతోంది: దేవినేని ఉమా

పీఎఫ్ సీ ద్వారా రూ.7 వేల కోట్ల అప్పు కోసం ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతోంది: దేవినేని ఉమా
  • ఆర్టీసీ ఉద్యోగుల నిధుల మళ్లింపునకు ప్రయత్నిస్తున్నారన్న ఉమా
  • అప్పుల కోసం అడ్డగోలుగా తప్పులు చేస్తున్నారని విమర్శలు
  • జగన్ ఆర్టీసీ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నారంటూ ధ్వజం
ఏపీలో ఆర్టీసీ ఉద్యోగుల నిధుల మళ్లింపునకు ప్రయత్నిస్తున్నారంటూ టీడీపీ నేత దేవినేని ఉమా మండిపడ్డారు. పీఎఫ్ సీ ద్వారా రూ.7 వేల కోట్ల అప్పు కోసం ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతోందంటూ ఆరోపించారు. అప్పుల కోసం అడ్డగోలుగా తప్పులు చేస్తున్నారని విమర్శించారు.

"ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి నిలువునా మోసం చేశారు. నిర్వహణకు సైతం నిధులు ఇవ్వక సురక్షితమైన ఆర్టీసీ ప్రయాణాన్ని ప్రమాదాల అంచున నిలబెట్టారు. ఇప్పటికే ఆర్టీసీని నష్టాల బాటలోకి నెట్టిన జగన్... తన అసమర్థతను కప్పిపుచ్చుకునందుకు సంస్థ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నారు" అంటూ దేవినేని ఉమా ధ్వజమెత్తారు.


More Telugu News