దక్షిణాదికి అన్యాయం: డీలిమిటేషన్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

  • 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోందన్న కేటీఆర్
  • లెక్క ప్రకారం మన వద్ద ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెరగాలని వ్యాఖ్య
  • కానీ జనాభా ప్రాతిపదికన విభజన చేస్తారని తెలిసిందన్న కేటీఆర్
  • ఉత్తరాది రాష్ట్రాలకు లబ్ధి చేకూరేలా పునర్విభజన ప్రక్రియను చేపడుతున్నారని ఆరోపణ
డీలిమిటేషన్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బూత్ స్థాయి నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోందన్నారు. లెక్క ప్రకారం మన వద్ద ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెరగాలని వ్యాఖ్యానించారు. కానీ జనాభా ప్రాతిపదికన విభజన చేస్తారని తెలిసిందన్నారు.

జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించాయని... కాబట్టి జనాభా ప్రాతిపదికన అంటే మనం నష్టపోతామన్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు లబ్ధి చేకూరేలా పునర్విభజన ప్రక్రియను చేపడుతున్నారని ఆరోపించారు.


More Telugu News