ప్రపంచంలోని అత్యంత రద్దీ విమానాశ్రయాలలో 10వ స్థానంలో ఢిల్లీ
- 2023లో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి 7.22 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు
- 10.46 కోట్ల మంది ప్రయాణికులతో తొలి స్థానంలో నిలిచిన అట్లాంటా ఎయిర్ పోర్ట్
- ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ తాజా నివేదికలో వెల్లడి
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచంలోని అత్యంత రద్దీ విమానాశ్రయాల జాబితాలో 10వ స్థానం సంపాదించింది. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి 2023లో 7.22 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించినట్లు ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ తన తాజా నివేదికలో వెల్లడించింది.
అంతర్జాతీయ గేట్ వేగా ఢిల్లీ
దేశం నుంచి సాగే అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు ఢిల్లీ విమానాశ్రయం గేట్ వేగా పేరుగాంచింది. ఇక్కడ మూడు టెర్మినళ్లు ఉన్నాయి. వాటిలో 3వ నంబర్ టెర్మినల్ దేశంలోకెల్లా అతిపెద్దది. ఇది ప్రపంచంలోకెల్లా ఐదో పెద్దది కావడం విశేషం. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో తొలి కార్బన్ న్యూట్రల్ ఎయిర్ పోర్టుగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచింది. ఎయిర్ పోర్టు సమీపంలో ఏర్పాటు చేసిన భారీ సోలార్ పవర్ ప్లాంట్ నుంచి విమానాశ్రయానికి అవసరమైన విద్యుత్ అందుతుంది.
కోవిడ్ తర్వాత ఎయిర్ ఫ్లయర్స్ పెరుగుదల
కోవిడ్ వైరస్ వ్యాప్తి తర్వాత ప్రపంచవ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని నివేదిక తెలిపింది. దీనివల్ల ఎయిర్ పోర్టులు చాలా రద్దీగా మారుతున్నాయని వివరించింది. 2023లో ప్రపంచవ్యాప్తంగా 850 కోట్ల మంది ప్రయాణికులు విమానాల్లో ప్రయాణించారని ఆ సంస్థ వివరించింది. 2022తో పోలిస్తే ఇది 27. 2 శాతం ఎక్కువ కావడం విశేషం.
తొలి స్థానంలో అట్లాంటా ఎయిర్ పోర్ట్
ప్రపంచంలోని అత్యంత రద్దీ ఎయిర్ పోర్ట్ లలో హార్ట్స్ ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ మరోసారి తొలి స్థానం సంపాదించింది. 2023లో 10.46 కోట్ల మంది ప్రయాణికులు ఈ ఎయిర్ పోర్ట్ నుంచి రాకపోకలు సాగించారు. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 12 శాతం అధికం. ఇక రెండో స్థానంలో లో దుబాయ్ (9 కోట్ల మంది ప్రయాణికులు) నిలవగా మూడో స్థానంలో డల్లాస్ ఎయిర్ పోర్ట్ (8.1 కోట్ల మంది ప్రయాణికులు) నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా లండన్ లోని హీత్రూ ఎయిర్ పోర్ట్ (7.9 కోట్ల మంది ప్రయాణికులు), టోక్యోలోని హనేడా ఎయిర్ పోర్ట్ (7.8 కోట్ల మంది ప్రయాణికులు), డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (7.7 కోట్ల మంది ప్రయాణికులు), ఇస్తాంబుల్ ఎయిర్ పోర్ట్ (7.6 కోట్ల మంది ప్రయాణికులు), లాస్ ఏంజిలెస్ అంతర్జాతీయ విమానాశ్రయం (7.5 కోట్ల మంది ప్రయాణికులు), షికాగో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (7.4 కోట్ల మంది ప్రయాణికులు) నిలిచాయి.