అన్నీ మనకే తెలుసనుకోకూడదు: కోన వెంకట్
- ఇటీవలే విడుదలైన 'గీతాంజలి మళ్లీ వచ్చింది'
- కొత్త పాత్రలు పరిచయం చేశామన్న కోన వెంకట్
- నిజమైన సీక్వెల్ అంటే ఇదేనని వ్యాఖ్య
- తన టీమ్ కి ఛాన్స్ ఇచ్చానని వెల్లడి
కోన వెంకట్ .. కథా రచయితగా .. సంభాషణాల రచయితగా ఆయనకి మంచి పేరు ఉంది. ఈ మధ్య కాలంలో నిర్మాతగా .. సహనిర్మాతగా కూడా ఆయన బిజీగా ఉన్నారు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' .. ఇటీవలే థియేటర్లకు వచ్చింది. అంజలి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ప్రస్తుతం థియేటర్స్ లో రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో 'గ్రేట్ ఆంధ్ర' ఇంటర్వ్యూలో కోన వెంకట్ మాట్లాడారు.
"గీతాంజలి' సినిమా ఎక్కడైతే ఆగిపోయిందో .. అక్కడి నుంచే 'గీతాంజలి మళ్లీ వచ్చింది' కథ మొదలవుతుంది. ఆడియన్స్ కి ఎక్కడా .. ఏ విధమైన కన్ఫ్యూజన్ ఉండదు. ముందు సినిమాలో లేని కొత్త పాత్రలలో సునీల్ .. అలీ .. సత్య కనిపిస్తారు. గీతాంజలి ఎందుకు మళ్లీ వచ్చింది? ఎవరి కోసం వచ్చింది? అనే దిశగా కథ ఆసక్తికరంగా నడుస్తుంది" అని అన్నారు.
"అన్నీ మనకే తెలుసు అనుకోకూడదు .. మన టీమ్ కి కూడా అవకాశాలు ఇస్తూ ఉండాలి. అందువలన 'గీతాంజలి' సినిమా కోసం నా దగ్గర అసిస్టెంట్స్ గా పని చేసిన భాను - నందూ ఇద్దరూ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే - సంభాషణలు అందించారు. అలా నాదైన టీమ్ తోనే నేను ముందుకు వెళుతున్నాను. సినిమాకి మంచి ఆదరణ దక్కుతున్నందుకు హ్యాపీగా ఉంది" అని చెప్పారు.