సన్‌రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత ప్లే ఆఫ్స్‌ రేసులో ఆర్సీబీ పరిస్థితి ఇదే!

  • మిగిలిన అన్ని మ్యాచ్‌లూ గెలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు
  • ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడి, ఆరింట ఓడిపోయిన ఆర్సీబీ
  • ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చిట్టచివరన నిలిచిన  డుప్లెసిస్ సేన
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరాజయాల పరంపర కొనసాగుతోంది. గత రాత్రి (సోమవారం) సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి తర్వాత ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు కేవలం ఒక్క విజయం సాధించింది. ఆరు ఓటములను మూటగట్టుకొని పాయింట్ల పట్టికలో చిట్టచివరన నిలిచింది. ఆ జట్టు నెట్ రన్ రేటు మైనస్ 1.185గా ఉంది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మిగిలివున్న అన్ని మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ఆ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. లేదంటే ఆశలు వదులుకోవాల్సిందేనని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు.

కాగా ఫాఫ్ డుప్లెసిస్ సారధ్యంలోని ఆర్సీబీ సోమవారం రాత్రి సన్ చేతిలో 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసి ఏకంగా 287 పరుగులు బాదిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్‌ చరిత్ర సృష్టించింది. ట్రావిస్ హెడ్ అద్భుత శతకంతో పాటు క్లాసెస్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్ రాణించడంతో ఆ జట్టు భారీ సాధించింది. ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 పాయింట్లతో టాప్-4లో తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది. ఇక 10 పాయింట్లతో టేబుల్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు జట్ల చేతిలో కూడా 8 పాయింట్లే ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ విషయంలో సన్‌రైజర్స్ కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి.


More Telugu News