సీఎం జగన్ కు హాని జరిగితే ఎవరికి లాభం?: విజయసాయిరెడ్డి

  • ఏప్రిల్ 13న విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడి
  • దాడి ఉద్దేశం బాబుకే ఉంటుందన్న విజయసాయి
  • బాబుకు గెలుపు ఆశలు సన్నగిల్లాయని వ్యాఖ్యలు 
ఈ నెల 13న విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడి జరిగింది. దీనిపై వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం వాగ్బాణాలు సంధించుకుంటున్నారు. తాజాగా ఈ అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. సీఎం జగన్ గారికి హాని జరిగితే ఎవరికి లాభం? అని సందేహం వెలిబుచ్చారు. న్యాయ పరిభాషలో దీన్ని మోటివ్ (ఉద్దేశం) అంటారని, ఈ మోటివ్ ఎవరికి ఉంటుంది? గెలుపు ఆశలు సన్నగిల్లిన చంద్రబాబుకు అని ఎవరైనా ఠక్కున చెబుతారని వెల్లడించారు. 

"కొడుకు భవిష్యత్తు ప్రశ్నార్థకం కావడంతో జగన్ గారిపై కసి, కక్ష, భౌతికంగా అంతం చేయాలన్న కుట్రపూరిత ఆలోచన బాబుకే ఉంది. జగన్ గారిపై హత్యాయత్నం విఫలమైన ప్రతిసారి బాబుతో పాటు ఆయన మీడియా క్షణాల్లో స్పందిస్తుంది. 'సానుభూతి కోసం జగనే చేయించుకున్నారు' అని ముందే సిద్ధం చేసుకున్న స్టేట్ మెంట్ ను జనంలోకి వదులుతుంది" అంటూ విజయసాయి ధ్వజమెత్తారు.


More Telugu News