ట్రావిస్ హెడ్ సంచలన శతకం... భారీ స్కోరు దిశగా సన్ రైజర్స్
- ఐపీఎల్ లో ఇవాళ సన్ రైజర్స్ వర్సెస్ బెంగళూరు
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
- 39 బంతుల్లోనే 100 పరుగులు పూర్తి చేసుకున్న హెడ్
- ఈ సీజన్ లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ
- తొలి వికెట్ కు 108 పరుగులు జోడించిన హెడ్, అభిషేక్ శర్మ
ఐపీఎల్ లో ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. ఆ నిర్ణయం తప్పని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు.
ఓపెనర్ ట్రావిస్ హెడ్ రికార్డు సెంచరీతో సంచలన బ్యాటింగ్ ప్రదర్శన నమోదు చేశాడు. ఈ సీజన్ లో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. హెడ్ కేవలం 39 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అతడి స్కోరులో 9 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు ఉన్నాయి. అతడి విజృంభణతో బెంగళూరు బౌలర్లు దిక్కులు చూశారు. హెడ్ ఏ బౌలర్ ను కూడా వదలకుండా కొట్టాడు.
ఈ మ్యాచ్ లోనూ హెడ్, అభిషేక్ శర్మల ఓపెనింగ్ విధ్వంసం కొనసాగింది. ఈ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు తొలి వికెట్ కు 108 పరుగులు జోడించి తిరుగులేని పునాది వేశారు. అభిషేక్ శర్మ 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 34 పరుగులు చేశాడు.
ప్రస్తుతం సన్ రైజర్స్ స్కోరు 12 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 158 పరుగులు. ట్రావిస్ హెడ్ 102, హెన్రిచ్ క్లాసెన్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.