నాలుగో పెళ్లాన్ని గెలిపించుకోవడానికి పవన్ కల్యాణ్ తెనాలికి వెళ్లారు: అంబటి రాంబాబు

  • ప్రజల కష్టాలు తీర్చేందుకే జగన్ సీఎం అయ్యారన్న అంబటి
  • జగన్ కు వస్తున్న ప్రజాభిమానాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని మండిపాటు
  • తెనాలిలో మనోహర్ గెలవడని వ్యాఖ్య
 ప్రజల కష్టాలను తీర్చేందుకు జగన్ ముఖ్యమంత్రి అయ్యారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మూడు పార్టీలు కలిసి వచ్చినా జగన్ ను ఓడించలేమని భావించి... ఇప్పుడు జగన్ పై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏదో ఒక రకంగా జగన్ ను హతమార్చాలని చూస్తున్నారని అన్నారు. ప్రజాబలం ఉన్న జగన్ పై కక్ష కట్టారని... అంతం చేయడానికి కుట్ర పన్నారని చెప్పారు. జగన్ పై మరో రాయి పడితే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఇక క్షమించరని అన్నారు. 

జగన్ ను చూస్తే చాలు, తాకితే చాలు అనుకునే వాళ్లు రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారని అంబటి రాంబాబు చెప్పారు. ఆ ప్రజాభిమానాన్ని చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని... అందుకే కుట్రలకు తెరతీశారని అన్నారు. వైసీపీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనను జగన్ తో పోల్చుకుంటున్నారని అంబటి ఎద్దేవా చేశారు. తెనాలిలో నాలుగో పెళ్లాం నాదెండ్ల మనోహర్ ను గెలిపించుకోవడానికి పవన్ అక్కడకు వెళ్లారని... తెనాలిలో మనోహర్ గెలవరని చెప్పారు. గతంలో మనోహర్ చేసిన అవినీతిని తెనాలి ప్రజలు మర్చిపోరని అన్నారు. చంద్రబాబుకు దాస్యం చేయడం, ఆయన మోచేతి నీళ్లు తాగడాన్ని పవన్ ఆపేయాలని చెప్పారు.


More Telugu News