ఆధార్ కార్డులో పుట్టిన తేదీ తప్పుపడిందా..? ఇలా మార్చుకోండి
- ఒక్కసారి మాత్రమే మార్చుకోవచ్చన్న యూఐడీఏఐ
- బర్త్ సర్టిఫికెట్ సహా గుర్తింపు పొందిన ధ్రువపత్రం తప్పనిసరి
- ఆధార్ సెంటర్ లో రూ.50 చెల్లించి మార్చుకునే వీలు
పుట్టిన పిల్లాడి నుంచి పండు ముసలి దాకా దేశంలోని ప్రతీ ఒక్కరికీ ఆధార్ కార్డు తప్పనిసరి అవసరంగా మారింది. కొత్త సిమ్ కొనడం దగ్గరి నుంచి బ్యాంకు ఖాతా తెరవడం దాకా.. దేనికైనా ఆధార్ చూపించాల్సిందే. మరి ఇంతటి కీలకమైన డాక్యుమెంట్ లో తప్పులు దొర్లితే..? ఒకటి రెండుసార్లు మార్చుకునేందుకు వీలుకల్పిస్తూ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) అనుమతిస్తోంది. పేరు, చిరునామా, పుట్టిన తేదీ, జెండర్ వివరాల్లో కొన్నింటికి ఒక్కసారి మాత్రమే మార్చుకునే అవకాశం కల్పించింది. పుట్టిన తేదీకి సంబంధించిన పొరపాట్లను సరిదిద్దుకోవడానికి అవకాశం కల్పించింది. తగిన గుర్తింపు పత్రంతో డేటాఫ్ బర్త్ ను సరిచేసుకోవచ్చని తెలిపింది. ఇందుకు గానూ పాన్‌కార్డ్, బర్త్ సర్టిఫికెట్, పాస్ పోర్ట్, బ్యాంక్ పాస్ బుక్, పదో తరగతి మార్కుల మెమో లలో ఏదైనా ఒక దానిని సాక్ష్యంగా చూపించి పుట్టిన తేదీని మార్చుకోవచ్చని వివరించింది. అయితే, ఈ ప్రక్రియను ఆధార్ సెంటర్ లోనే చేసే వీలుంది. కాగా, ఆధార్ కార్డుకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి యూఐడీఏఐ ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నెంబర్ 1947 ను ఏర్పాటు చేసింది.
మార్చుకోవడం ఇలా..
మార్చుకోవడం ఇలా..
- దగ్గర్లోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి కరెక్షన్ ఫారమ్ నింపాలి
- పుట్టిన తేదీ వివరాలలో చేయాల్సిన మార్పులు పేర్కొంటూ ప్రూఫ్ డాక్యుమెంట్ జతచేయాలి
- రూ.50 ఫీజు చెల్లించి, బయోమెట్రిక్ వివరాలు ఇస్తే సరిపోతుంది
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయ్యాక మీ ఆధార్ కార్డులో పుట్టిన తేదీ అప్ డేట్ అవుతుంది
- ఆపై ఆన్ లైన్ లో అప్ డేటెడ్ ఆధార్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు