నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు: తనికెళ్ల భరణి
- రచయితగా .. నటుడిగా పేరు తెచ్చుకున్న భరణి
- శివుడితో అనుబంధాన్ని గురించి ప్రస్తావన
- 'ఆటగదరా శివా'తో దేశవిదేశాలు తిరిగానని వెల్లడి
- ఆ రోజున శివుడే ఆకలి తీర్చాడని వివరణ
తనికెళ్ల భరణి .. రచయితగా ఆయన అనేక సినిమాలకు పనిచేశారు. ఆ తరువాత నటుడిగా .. దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. 'ఆటగదరా శివా' అంటూ ఆయన సరళమైన భాషలో జీవన సత్యాలను అందించారు. తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.
"శివుడు నా జీవితంలోకి వచ్చాక అద్భుతాలు జరిగాయి. 'ఆటగదరా శివా 'ను దేశం నలుమూలలా పాడాలని ఉందని శివయ్యతో అనుకున్నాను. అవకాశం కల్పిస్తే వివిధ దేశాలలోని తెలుగు వాళ్లకి ఈ సాహిత్యాన్ని వినిపిస్తానని మనసులోనే శివయ్యకి చెప్పుకున్నాను. ఆశ్చర్యం ఆ తరువాత నేను అనేక దేశాలలో పర్యటించాను. అక్కడి స్టేజ్ లపై 'ఆటగదరా శివా'ను పాడాను" అని అన్నారు.
" ఆ తరువాత ఒకసారి మా ఫ్యామిలీ అంతా కలిసి 'తంజావూరు' వెళ్లాము. కానీ అక్కడ కొన్ని కారణాల వలన బంద్ జరుగుతోంది. భోజనం కాదు గదా .. కనీసం కాఫీ కూడా దొరికే పరిస్థితి లేదు. మధ్యాహ్నం 2 అవుతోంది .. మాకు విపరీతమైన ఆకలి వేస్తోంది. ఆ సమయంలో నేను తెలిసిన ఒక హోటల్ వ్యక్తి మమ్మల్ని తీసుకుని వెళ్లి .. మాకు ఇష్టమైన భోజనం వండి పెట్టాడు. ఇదంతా శివయ్య కృప కాక మరేమిటి? " అంటూ ఆ సంఘటనను మరోసారి గుర్తుచేసుకున్నారు.