చర్చలు సఫలం.. సీజ్ చేసిన నౌకలోని భారతీయ సిబ్బందిని కలిసేందుకు ఇరాన్ అనుమతి
- ఇరాన్ ప్రభుత్వంతో మాట్లాడి ఖరారు చేసిన విదేశాంగమంత్రి జైశంకర్
- 17 మంది నౌక సిబ్బందితో భారతీయ అధికారులకు భేటీ అయ్యేందుకు దక్కిన అవకాశం
- వారిని విడిపించడంపై కూడా దృష్టిపెట్టిన భారత విదేశాంగ శాఖ
ఇజ్రాయెల్‌పై దాడికి ఒక రోజు ముందు ఇరాన్ స్వాధీనం చేసుకున్న కార్గో షిప్‌లో ఉన్న 17 మంది భారతీయ సిబ్బందిని కలిసేందుకు భారత ప్రభుత్వ అధికారులకు అనుమతి లభించింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రంగంలోకి దిగి ఇరాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ అబ్దుల్లాహియాన్‌తో ఫోన్‌లో మాట్లాడి ఈ విషయాన్ని ఖరారు చేశారు. సీజ్ చేసిన నౌకకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నామని, త్వరలోనే భారత ప్రభుత్వ ప్రతినిధులు నౌకలోని భారతీయ సిబ్బందిని కలవొచ్చని ఆమిర్ చెప్పినట్టు జైశంకర్ వెల్లడించారు. మరోవైపు నౌకలోని సిబ్బందిని విడిపించడంపై కూడా భారత్ దృష్టిపెట్టింది. ఈ విషయాన్ని ఇరాన్‌తో చర్చించినట్టు జైశంకర్ తెలిపారు.
ఆదివారం సాయంత్రం ఆమిర్ అబ్దుల్లాహియాన్‌తో ఫోన్ లో మాట్లాడానని జైశంకర్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఆ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిపై చర్చించామని, ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరం కాకుండా సంయమనం పాటించాల్సిన ఆవశ్యకత గురించి గుర్తుచేశానని జైశంకర్ పేర్కొన్నారు. సంప్రదింపులకు అందుబాటులో ఉంటామని ఇరాన్ హామీ ఇచ్చిందని జైశంకర్ వివరించారు.