నా జీతం నెలకి నాలుగు వందలు .. అందుకే అప్పులయ్యాయి: 'జబర్దస్త్' గడ్డం నవీన్
- 'జబర్దస్త్' తో పాప్యులర్ అయిన నవీన్
- ఆ షో వల్లనే గడ్డం నవీన్ గా దక్కిన గుర్తింపు
- ఆర్ధికంగా ఇబ్బందులు పడ్డానని వెల్లడి
- తన బాస్ ఆదుకున్నాడంటూ కృతజ్ఞతలు
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న నటులలో గడ్డం నవీన్ ఒకరు. బట్టతల .. గుబురు గడ్డంతో కూడిన లుక్ తో ఆకట్టుకుంటూ, తనదైన డైలాగ్ డెలివరీతో నవ్విస్తూ అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'జబర్దస్త్'కి రాకముందు ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఆ సమయంలో నా జీతం నెలకి 400 .. ఆ డబ్బుతోనే ఇల్లు నెట్టుకొచ్చేవాడిని. ఒక్కోసారి అవసరాలకు .. ఆపదలకు అప్పు చేయవలసి వచ్చేది" అని అన్నాడు.
" అలా అప్పు 6 లక్షలకి చేరుకుంది .. నాకు వచ్చేది నెలకి 400. అలాంటి పరిస్థితుల్లో అప్పులు ఇచ్చినవాళ్లు మా ఆఫీసుకి వచ్చి నన్ను తిడుతుంటే, మా బాస్ దినేశ్ గారు చూశారు. అప్పుడు ఎవరెవరి దగ్గర ఎంత ఉన్నాయనేది నాతో రాయించారు. మొత్తం 6 లక్షలకి లెక్కతేలింది. ఆ మరుసటి రోజున ఆయన వాళ్లందరినీ పిలిపించి, రజనీకాంత్ మాదిరిగా చెక్కులు రాసిచ్చేసి పంపించారు. అందువలన ఆయన పట్ల నాకు ఎప్పటికీ కృతజ్ఞత ఉంటుంది" అన్నాడు.
"నేను సినిమాలలో చిన్న చిన్న వేషాలు వేశాను .. వేస్తున్నాను. కానీ నాకు ఇంతటి గుర్తింపు రావడానికి కారణం 'జబర్దస్త్'. ఇప్పుడు మేము బయట ఈవెంట్స్ చేసుకుని డబ్బులు సంపాదించుకోవడానికి కారణం కూడా 'జబర్దస్త్' నే. ఈ మధ్య చిరంజీవిగారి సమక్షంలో .. రాఘవేంద్రరావుగారి సమక్షంలో నటించే అవకాశం వచ్చింది. అంతకుమించిన అదృష్టం లేదు. ఇక నేను నటించకపోయినా బాధలేదు" అని చెప్పాడు.