అతను 180 మంది పిల్లలకు తండ్రి.. ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట!
- పదమూడేళ్లుగా స్పెర్మ్ డొనేట్ చేస్తున్న యూకే పౌరుడు
- గర్భం కోసం మహిళలు తన దగ్గరికి వస్తారని వెల్లడి
- కొంతమందితో లైంగికంగా కూడా కలిశానని వివరణ
- విక్కీ డోనర్ సినిమా కథ ఈయన జీవితమే
పెళ్లి అయి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగకుంటే బాధ మామూలుగా ఉండదు.. సంతానం కోసం ఎంతోమంది భార్యాభర్తలు వైద్యులను సంప్రదిస్తూ, ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటారు. ఇలాంటి వారి కోసమే తాను స్పెర్మ్ డోనార్ గా మారానని యూకేకు చెందిన జో డోనార్ చెబుతున్నాడు. అసలు పేరు వేరే ఉన్నా జో డోనర్ గానే ఫేమస్ అయ్యాడు. పదమూడేళ్లుగా వీర్యదానం చేస్తూ ఇప్పటి వరకు 180 మందికి తండ్రయ్యానని వివరించాడు. తాను లైంగిక సుఖం కోసమే ఇలా చేస్తున్నానని కొంతమంది విమర్శించడంపై విచారం వ్యక్తం చేశాడు. ఇంతమందికి తండ్రయినా ఇప్పటి వరకూ ఒక్క మహిళ నుంచి కూడా ప్రేమగా ముద్దు అందుకోలేదని చెప్పాడు.
కొంతమంది మహిళలు తల్లి కావడానికి తనతో లైంగికంగా కూడా కలిశారని చెప్పాడు. అయితే, అది కేవలం గర్భం కోసం చేస్తున్న పనిలానే, అవసరం మేరకు జరిగిందని వివరించాడు. అవతలి వ్యక్తి దృష్టి మొత్తం గర్భందాల్చడంపైనే ఉండడంతో ప్రేమగా కౌగిలించుకోవడం కానీ, కలయిక తర్వాత హత్తుకుని సేదతీరడమో జరగలేదని జో డోనార్ తెలిపాడు. నెలలో ఒకరో ఇద్దరో తనను కలుస్తారని, గర్భం దాల్చిన తర్వాత మళ్లీ తనను కలవరని వివరించాడు. స్పెర్మ్ డోనార్ గా మారి 180 మందికి తండ్రిని అయినా తనకంటూ ఓ కుటుంబమే లేదని చెప్పాడు. జో డోనార్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ కావడంతో ఆయన జీవితంపై బాలీవుడ్ లో ఓ సినిమా కూడా వచ్చింది. ‘విక్కీ డోనార్’ పేరుతో వచ్చిన ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా, యామి గౌతమ్ లు నటించారు.